ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeతెలంగాణఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 8,200 క్యూసెక్కుల నీరు విడుదల

ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 8,200 క్యూసెక్కుల నీరు విడుదల

📰 Generate e-Paper Clip

ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 8,200 క్యూసెక్కుల నీరు విడుదల

నమస్తే భారత్ నవంబరు 5 (ప్రేమ్ కిరణ్)

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం.. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఎగువ ప్రాంతాల నుంచి ఎర్రకాలువ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని ఎర్రకాలువ రిజర్వాయర్‌కు చెందిన రెండు గేట్లను ఎత్తి దిగువకు 8,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.428 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 82.90 మీటర్లకు చేరుకోగా, నీటి నిల్వ 3.835 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి విడుదలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కాలువలు, వాగులు, పరివాహక ప్రాంతాల వద్ద నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ప్రజలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదని, పశువులను సైతం నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల వైపు తీసుకెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!