ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

📰 Generate e-Paper Clip

విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు

నమస్తే భారత్ :-మహబూబాబాద్

విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం (పిపిఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లాలోని హనుమంతునిగడ్డ లోగల స్ధానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో పిపిఎల్ జిల్లా విస్త్రుత స్థాయి సమావేశం జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు, రాష్ట్ర కన్వీనర్ చాతల్ల సదానందంలు పాల్గొని వారు మాట్లాడుతూ అంగన్వాడీ నుండి మొదలుకొని యూనివర్సిటీ వరకు కనీస మౌళిక వసతులు లేక ఎన్నో సమస్యలతో విద్యార్థిని, విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం పౌష్టికాహారం అందించటంలో కూడా అనేకలోపలున్నాయని అన్నారు. సరిపడ బోధన సిబ్బంది లేకపోవడం , ప్రభుత్వ బడులు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యాసంస్థలకు పక్కా భవనాలు లేకపోవడం,ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలలకు పీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు జీవో నెంబర్ 5 ను తుంగలో తొక్కి పీజు లు కట్టమని వేధింపులకు గురిచేస్తూన్నారని అన్నారు.నేడు అస్తవ్యస్తమైన గురుకులాలను పట్టించుకునే నాథుడే లేడని తెలిపారు.ఫలితంగా పేద, నిరుపేద, మధ్యతరగతి బిడ్డలు నాణ్యమైన విద్యకు దూరమవుచున్నారని , తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా ఏడేల్లి వెంకటేశ్ ( మరిపెడ) , జిల్లా అధికార ప్రతినిధి గా ఐనాల వెంకన్న (మరిపెడ), జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరెల్లి మల్లేష్ (గూడూరు), ప్రధాన కార్యదర్శిగా మునిగంటి కోమలి ( నెల్లికుదురు) కో ఆప్షన్ లో కొంతమందితో జిల్లా కమిటి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈకార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోట్ల మౌనిక, ఉమ్మడి వరంగల్ జిల్లా అడ్వైజర్ శనిగరపు శ్రీనివాస్, పిపిఎల్ నాయకులు ఏడేల్లి వెంకటేశ్, ఐనాల వెంకన్న ఈరెల్లి మల్లేష్,తప్పెట్ల చాణక్య, ఇమ్మడి వెంకటేశ్వర్లు, మట్టే మధు,కోమలి, యాసారపు రేణుక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!