వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి:
ఎం.డి. అబ్దుల్ రషీద్
నమస్తే భారత్ :-మరిపెడ
వినాయక చవితి సందర్భంగా సోమవారం మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. మండపాల చుట్టుపక్కల చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు.
వినాయక మండపాల వద్ద భక్తుల సౌకర్యార్థం సరైన లైటింగ్ సౌకర్యం కల్పించాలని, రాత్రి వేళల్లో నిర్వాహకులు, భక్తులు మండపాల వద్దనే నిద్రించే అవకాశం ఉన్నందున దోమల బెడద లేకుండా ముందస్తుగా దోమల మందు పిచికారీ చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వినాయక చవితి పండుగను కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకుంటున్నారు అని ఎం.డి. అబ్దుల్ రషీద్ అన్నారు.ఈ కార్యక్రమంలో కోటి రెడ్డి , రహీముద్దీన్ , ఎస్.కె. హుస్సేన్ , నర్సిరెడ్డి , జగన్ రెడ్డి, కృష్ణ. కొండ వెంకన్న , యాకయ్య, ధనుష్ రాజు, చింటూ, సాయి సోహెల్ , అష్రాఫ్ , సత్యం.ప్రభాకర్ రాజేష్ , ఐలయ్య సుధాకర్ , రామయ్య , అయ్యగారు అజయ్. తదితరులు పాల్గొన్నారు.



