ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణబాధితుల కష్టాల్లో భాగస్వామినవుతా. అండగా నిలుస్తా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు...

బాధితుల కష్టాల్లో భాగస్వామినవుతా. అండగా నిలుస్తా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్

📰 Generate e-Paper Clip

బాధితుల కష్టాల్లో భాగస్వామినవుతా. అండగా నిలుస్తా

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

ఇటీవల అకాల మరణం చెందిన పలువురి కుటుంబ సభ్యులను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ స్థానిక సర్పంచ్ యాసాడి బాలాజీ రెడ్డి మరియు మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు భాదిత కటుంబాలను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు..​
కోరుకొండపల్లి గ్రామ పరిధిలోని మెగ్యా తండాలో ఇటీవల మృతి చెందిన యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య సతీష్ తండ్రి భూక్యా రామ్ కోటి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రామ్ కోటి కుమారులు భూక్య లక్ష్మణ్, భూక్య సతీష్, భూక్య విజేందర్లతో మాట్లాడి ఓదార్చారు.కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.​అదేవిధంగా కోరుకొండపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వేం నరేందర్ రెడ్డి అనుచరులు మూల భూలోక్ రెడ్డి తమ్ముడు మూల ఆనంద్ రెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంద్ రెడ్డి కుమారుడు మూల రాజ వర్ధన్ రెడ్డి, సోదరుడు మూల భూలోక రెడ్డిలను పరామర్శించి,ఆనంద్ మరణం వారి కుటుంబానికి తీరని లోటని,వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని, తమ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్,బీరం గోపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ నాగేల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్,వార్డు సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో.తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!