*దళితులు అంటే కెసిఆర్ కు ఇంత అహంకారమా*

*బిఆర్ ఎస్ పార్టీ నేతలకు*
*బుద్ధి జ్ఞానం ప్రసాదించాలి*
*దళితులు నడిచిన నేలను పసుపు శుద్ధి చేసిన మీకు దళితులు గుణపాఠం తప్పదు*
*ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి చౌరస్తా కు ర్యాలీ గా వెళ్లి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు వినతి పత్రాన్ని అంద జేసిన షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం నేతలు*
నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్11: రాజ్యాంగ నిర్మాత గౌరవ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి రాయునది ఏమనగా విషయం: రాజ్యాంగ పరిధిలో ఉన్న గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని బిఆర్ఎస్ నాయకులు అవమానించిన విషయం గురించి.
80 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఇంకా కుల అహంకారంతో దళితులను అవమానించడం దురదృష్టకరం ప్రపంచం అభివృద్ధి వైపు పరిగెడుతుంటే బిఆర్ఎస్ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ కి రాకపోగా ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించమంటే గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని దళితుడు అని నోటికి వచ్చిన మాటలు రాయలేని బూతులు మాట్లాడి అలాగే ఫామ్ హౌస్ కి వెళ్ళిన దళితుల నాయకులను పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం పట్ల టిఆర్ఎస్ నాయకులకు మంచి బుద్ధి మంచి ఆలోచన మంచి మాటలు ప్రసాదించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నేతలు కరోల్ల సురేందర్, జాంగారి రవి మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి పై నిరసన వ్యక్తం చేస్తూ, తాత మధు ను బి ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఎర్ర వల్లి లో ఫామ్ హౌస్ వద్దకు దళితులు వచ్చారని పసుపు నీళ్లతో శుద్ధి చేయించిన కేసీఆర్ పూర్తిగా దళిత వ్యతిరేకి అని యావత్ దళిత జాతికి తెలిసిపోయింది అని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతలు తెలిపారుఫామ్ హౌస్ వద్దకు దళితులకు వచ్చినందుకు పసుపు నీళ్లతో శుద్ధి చేయించిన కేసీఆర్. దళితులు అంటే ఇంత ఇంత అహంకారమా
అని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు ప్రశ్నించారుఎర్రవల్లి లో కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు దళితులు వచ్చారని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీఆర్ఎస్ నేతలు మరి రేపు ఏమి మొహం పెట్టుకొని దళితుల ఓట్లు అడుగుతారు అని అన్నారు
మాట్లాడుతూదళిత ముఖ్య మంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి , దళితులు కి దళిత బందు ఇస్తానని అడుగు అడుగున దళితులను మోసం చేసిన దళిత ద్రోహి కెసిఆర్ అని నేతలు అన్నారు
తన ఫామ్ హౌస్ కి దళితులు వచ్చారని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన దళితులు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన మాజీ సీఎం కెసిఆర్, బి ఆర్ ఎస్ పార్టీ దళితులకు క్షమాపణ చెప్పాలి అని అని డిమాండ్ చేశారు కార్యక్రమం లో పాల్గొన్న,
షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ ,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ రఘు నాయక్, సీనియర్ నాయకులు ఆగిర్యాల కృష్ణ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు లు బాలరాజు గౌడ్,
మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేపల్లి కుమార స్వామి గౌడ్, కోగురి పురుషోత్తం రెడ్డి, అన్మగల్ల రమేష్,జాకరం చంద్ర శేఖర్,పట్టణ అధ్యక్షులు నల్ల మోని శ్రీధర్,
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, గిరిజన విభాగం అధ్యక్షుడు శ్రీను నాయక్, నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా నర్సింహులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ కరణకర్ ,ఎస్సీ విభాగంనేత లు బాధేపల్లి సిద్దార్థ, కరోళ్ళ సురేందర్,జాంగారి రవి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నాగి సాయిలు, బొరిగే నరేందర్, నాగిల్ల భాస్కర్, అనంతయ్య, జక్కని రవి కుమార్ , మాస్టర్ ఆంజనేయులు,టౌన్ అధ్యక్షుడు సింగపగా అనిల్ కుమార్, నేతలు సింగపాగా జంగయ్య, పద్మారం అశోక్,కొత్తూరు మాజీ సర్పంచ్ జనిగే జగన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జాం గారి జంగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిలు , దళిత సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, దళిత ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



