3వ వార్డులో పారిశుధ్య పనులపై డీసీసీ వీసారపు శ్రీపాల్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి పరిశీలన
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 3వ వార్డులో చేపట్టాల్సిన పారిశుధ్య పనులపై ఆదివారం డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పరిశీలన నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
వార్డులో చెత్తాచెదారం పేరుకుపోకుండా నిత్యం పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు డ్రైనేజీలు, మురుగు కాలువలను శుభ్రం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు మెరుగైన పారిశుధ్య వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వీసారపు శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ పాషా, వెంకన్న, ముత్తయ్య, రేఖ, అశోక్, శ్రీను.స్వామి వీరన్న. రమేష్.పాపయ్య తదితరులు పాల్గొన్నారు.



