ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణ*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

📰 Generate e-Paper Clip

*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

*సమాజ హితం కోసం పాత్రికేయులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి*

*ఆత్మీయ అనురాగాల మధ్య ఏ సిక్స్ 6 టివి,సిఇఓ అప్సర్ జన్మదిన వేడుకలు..*

నమాస్టే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్, 02:ఏ సిక్స్ 6 టివి,సి ఈ ఓమేనేజింగ్ పార్ట్నర్, సీనియర్ పాత్రికేయుడు మహమ్మద్ అప్సర్ భాయ్ జన్మదిన వేడుకలు ఏ సిక్స్ 6 టివి,స్టూడియోలో ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు పాత్రికేయులు, మిత్రులు పాల్గొని అప్సర్ భాయ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ.. మీడియా రంగంలో అప్సర్ భాయ్‌కు ఉన్న అపారమైన అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న అవగాహన, వార్తలను ప్రజలకు చేరవేయడంలో చూపించే అంకితభావం అభినందనీయమన్నారు. పాత్రికేయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సమాజానికి సేవ చేసే బాధ్యతగా భావించే వ్యక్తులు ప్రజల విశ్వాసాన్ని పొందుతారని పేర్కొన్నారు.
సమాజంలో జరుగుతున్న మంచి, చెడు పరిణామాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు అన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం లభించేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం పాత్రికేయుల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
“అప్సర్ భాయ్ తన అనుభవంతో మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నిష్పక్షపాతంగా, వాస్తవాలను ప్రజలకు చేరవేస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆయన సేవలు యువ పాత్రికేయులకు స్ఫూర్తిగా నిలవాలి. ఆయురారోగ్యాలతో, ఆనందంతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ఆకాంక్షించారు.
అనంతరం అప్సర్ భాయ్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేయించి ఒకరికొకరు తినిపిస్తూ జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు జగన్, దుర్గా ల్యాబ్ కే. సురేష్, మహమ్మద్ అమానుల్లా ఘోరి, మొహమ్మద్ ఫజిల్ ఘోరి, సయ్యద్ షౌకత్, ఏ. పవన్ తదితరులు పాల్గొని అప్సర్ భాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏ సిక్స్ 6 టివి, సీనియర్ పాత్రికేయుడు మహమ్మద్ అప్సర్ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను ఇంత ఆత్మీయంగా నిర్వహించి, తనపై ప్రేమాభిమానాలు చూపించిన డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు కు , పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“జన్మదినం సందర్భంగా వచ్చే శుభాకాంక్షల కంటే.. మనపై మిత్రులు చూపించే ఆత్మీయత, ప్రేమ, అభిమానం ఎంతో విలువైనవి. పాత్రికేయుడిగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యతగా భావిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మీడియా రంగంలో కొనసాగుతూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని అప్సర్ భాయ్ తెలిపారు.
ఆత్మీయత, అనురాగం, స్నేహభావంతో సాగిన ఈ జన్మదిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాత్రికేయుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తూ, పరస్పర సహకారం మరియు సామాజిక బాధ్యతను చాటిచెప్పే విధంగా ఈ వేడుకలు జరిగాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!