ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణయువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

*యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.*

 

*◆ తల్లిదండ్రులు పాఠశాల, కళాశాల యజమాన్యాలు విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి.*

 

నమస్తే భరత్,,, 27/8/2026/ నారాయణపేట జిల్లా,

 

*◆ విద్యా సంస్థలలో విద్యార్థులకు సామాజిక నైతిక విలువలను అందించాలి.*

 

*◆ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి*

 

మఖ్తల్ పట్టణ కేంద్రంలో 27 ఆగస్టు తెల్లవారుజామున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదాన ప్రాంగణంలో ఉన్న ఒక మహిళపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు అత్యాచారం చేసి ఆమెను తీవ్రంగా గాయపరచడమే కాకుండా తన తల్లిపై జరుగుతున్న ఆ అమానుష ఘటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన 12 ఏళ్ళ కొడుకును కూడా తీవ్రంగా గాయపరచడం సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. పై సంఘటనకు కారకులైన వారిని తీవ్రంగా శిక్షించాలని ఏబీవీపీ తరఫున డిమాండ్ చేస్తూ మఖ్తల్ పట్టణంలో ఇప్పటికే ఉన్న పోలీసుల నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని రాత్రిపూట పెట్రోలింగ్ నిబంధనలను మరింత కఠినం చేయాలని కోరారు. మఖ్తల్ పట్టణ కేంద్రంలో సిటీ కల్చర్ పేరుతో కొందరు యువకులు మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నారని విచ్చలవిడి దూమపానం,మద్యపాన వినియోగాలతో అనారోగ్య సమస్యలతో పాటు అనేక చెడు వ్యసనాలకు కూడా ఆకర్షితులవుతున్నారని కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులతో పాటు కుటుంబ సభ్యుల పర్యవేక్షణతో మాత్రమే ఈ మాదకద్రవ్యాల మహమ్మారిని నియంత్రించడానికి వీలవుతుందని అన్నారు. మఖ్తల్ పట్టణంలో ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా కొనుగోలు చేసే సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని సూచించారు.

రాత్రి వేళలో ఇష్టానుసారంగా అమ్మకాలు జరిపే బెల్ట్ షాపులతో పాటు , పాన్ షాపులు సిగరెట్ గుట్కా వంటి నిషేధిత పదార్థాల క్రయవిక్రయాలు జరిగే స్థలాలపై కూడా దృష్టి సారించాలని పోలీసు శాఖను కోరారు.

మక్తల్ పట్టణ కేంద్రంలోని కొన్ని పాఠశాలలు , ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కూడా రక్షణ లేని వసతుల కారణంగా కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నది కావున సీసీటీవీ పర్యవేక్షణ, లైటింగ్ ఏర్పాటు చేయడం వంటి భద్రత చర్యలు తీసుకోవాలని పాఠశాల కళాశాలల సిబ్బందిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు వినయ్ కుమార్,అంబ్రేష్,రమేష్,వినయ్,శివ, తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!