ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి --ఆర్డివో రమాదేవి

ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి –ఆర్డివో రమాదేవి

📰 Generate e-Paper Clip

ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి 

–ఆర్డివో రమాదేవి

మెదక్,ఆగస్టు 27(నమస్తే భరత్):

ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలనీ మెదక్ ఆర్డివో రమాదేవి అన్నారు.

గురువారం ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన,సవరణల అంశాలపై మెదక్ పట్టణంలోని 133,134 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆర్ డి ఓ రమాదేవి పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఆర్డిఓ రమాదేవి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 సమర్పించాలని వారు సూచించారు.అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు,చిరునామా, ఫోటో,బంధుత్వం తదితర వివరాల్లో సవరణలు అవసరమైతే ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ప్రజలు, బిఎల్ఓలు,బిఎల్ఏ లు, సంబంధిత అధికారులు ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈకార్యక్రమంలో తాహాసిల్దార్ లక్ష్మణ్ బాబు,

అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!