ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి –ఆర్డివో రమాదేవి
ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి --ఆర్డివో రమాదేవి మెదక్,ఆగస్టు 27(నమస్తే భరత్): ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలనీ మెదక్ ఆర్డివో రమాదేవి అన్నారు. గురువారం ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన,సవరణల అంశాలపై మెదక్ పట్టణంలోని 133,134 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆర్ డి ఓ రమాదేవి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డిఓ రమాదేవి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 సమర్పించాలని వారు సూచించారు.అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు,చిరునామా, ఫోటో,బంధుత్వం తదితర...