వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్24: ప్రజాస్వామ్య పద్ధతిలో
నీరుసన తెలపడం కూడా నేరంగా పరిగణిస్తే ఎట్లా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు రాజ్యాంగబద్ధకంగా జరగాల్సిన న్యాయం జరగకపోగా పాలక ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకమైన జీవోలను తీసుకువచ్చి అక్రమంగా అమలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతారు అలాంటి ప్రతి నిరసనకు పోలీసులతో అనుమతి తీసుకోవాలంటే అది కుదరని పరిస్థితి ఆ మూమెంట్‌ను బట్టి ఆ ఉద్యమ పరిస్థితిని బట్టి పోరాటాన్ని నిర్ణయించడం జరుగుతుంది అంతేకానీ కావాలని రోడ్లమీద కొచ్చి పోరాటాలు చెయ్యాల్సిన అవసరం ఉండదు అది పోలీసులు గమనిస్తే బాగుంటుందని ఆయన అన్నారు షాద్‌నగర్ పోలీసులకు అత్యుత్సాహం కాకపోతే ఆర్డీవో ఆఫీస్ దగ్గరజీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన సమస్యపై షాద్‌నగర్ టు హైదరాబాద్ లింగారెడ్డి గూడ చౌరస్తా రోడ్డుపై పోరాటం చేస్తుంటే విద్యార్థులకు మద్దతుగా ఏఐఎస్ఎఫ్ ఆకాశ్ నాయక్ ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ బిజెపి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు తెలపడమే తప్పుగా పరిగణిస్తే డెమోక్రసీ పద్ధతిలో ఇది ఎట్లా సరైనది పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది పాలిటెక్నిక్ విద్యార్థులుగా పోలీసుల పిల్లలు కూడా ఉండి ఉంటారు వారి భవిష్యత్తు ఏంది వాళ్ళకి ఈ విషయంపై గానీ హవగాన ఉన్నదా నిజంగా హవగాహననే ఉండి ఉంటే పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయాలి అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా జీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ పిల్లలకు ఇది శాపంగా మారింది కావున దీని వెంటనే రద్దు చేయాలని
యావత్ ప్రజానీకం మీ వెంట ఉండి సపోర్ట్ చేస్తది అంతేకానీ ఉద్యమించె వారిపై అక్రమకేసులు పెట్టడం అనేది పోలీసులకు సరైనది కాదు వెంటనే పెట్టిన కేసులు ఎత్తివేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేనియెడల ప్రజాస్వామ్య పద్ధతిలో సిపిఐ పార్టీగా కలిసి వచ్చే పార్టీలను సంఘాలను అంనిటిని కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంటుందని దానికి షాద్‌నగర్ పోలీసులే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం.



