మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ముఖ్య నాయకుల ఘన సన్మానం
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి
AMC చైర్మన్ గంట సంజీవరెడ్డి
నమస్తే భారత్ :-కేసముద్రం
కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ నియమితులైన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి.మాట్లాడుతూ.సమ్మయ్య గౌడ్‌కు ఉన్న ప్రజాసేవ అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి.ఉపయోగించుకోవాలని.అన్నారు. సీనియర్ నాయకుల సూచనలు, అనుభవాలను తీసుకుంటూ కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని, తనకు అప్పగించిన మండల అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని.ఆకాంక్షించారుసమ్మయ్య.గౌడ్.నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి: ముఖ్య నాయకులు.ముఖ్య నాయకులు.మాట్లాడుతూ.సమ్మయ్య గౌడ్ నాయకత్వంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఆయనకు ఉన్న ప్రజాసేవ అనుభవాన్ని పార్టీకి మరింతగా ఉపయోగించుకొని, మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేలా పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సునీత వెంకన్న నాయక్, వైస్ చైర్మన్ అల్లం రామ నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత–దుర్గేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ సర్పంచ్ బండారి దయాకర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హోలం కృష్ణుడు, వసంతరావు, పోలపాక నాగరాజు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల మురళి, రఫీ, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.



