ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉపాధ్యాయుల సమస్యలపై ఛలో హైదరాబాద్

ఉపాధ్యాయుల సమస్యలపై ఛలో హైదరాబాద్

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయుల సమస్యలపై ఛలో హైదరాబాద్

ఖానాపురం ఆగష్టు14 (నమస్తే భారత్ ) :

ఉపాధ్యాయుల సమస్యలపై
సెప్టెంబర్ 1 న హైదరాబాద్ ఇందిరాపార్క్ నందు జరిగే మహాధర్నాకు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిఆర్ టీయు జిల్లా అధ్యక్షులు ఇదునూరి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఖానాపురం మండల కేంద్రంలోని హైస్కూల్ లో పిఆర్ టీయు ఖానాపురం మండల శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉపాధ్యాయ సమస్య ఏదైనా దాని పరిష్కారం పిఆర్ టీయుతో మాత్రమే సాధ్యమని ఉద్ధాటించారు. మంచి పిట్మెన్ తో పిఆర్ సీ ఇప్పించే బాధ్యత పిఆర్ టీయు సంఘముతోనే సాధ్యమన్నారు. అనంతరం పిఆర్ టీయు నూతన మండల కమిటి ఎన్నుకున్నారు. జరిగింది. పిఆర్ టియు ఖానాపురం మండల అధ్యక్షులుగా అలువాల బిక్షపతి , ప్రధాన కార్యదర్శిగా జాటోత్ జేతురామ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అసోసియేట్ అధ్యక్షులుగా డి. వీరన్న ,రాజునాయక్ ,
కార్యవర్గ సభ్యులుగా సమంత , సారంగపాణి రజిత, చంద్రమౌళి , భాస్కర్ బానోత్ వీరన్న , మేనక , సునీత లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిఆర్ టీయు మాజీ అధ్యక్షులు డా. పెండెం భాస్కర్, నెల్లూరి ప్రసాద్ రావు , జె ఆశోక్ వివిధ మండలాల అధ్యక్షులు. ప్రధానకార్యదర్శులు, వివిధ పాఠశాలల గౌరవ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,ప్రాథమిక సభ్యులు ఎంఆర్ సీ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!