సిద్దాపూర్ డంపింగ్ యార్డు రద్దు కోసం ఆగస్టు 11 న కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నా జయప్రదం చేయండి.
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 10:షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూరు మండలం సిద్ధాపూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల, లంబాడి తండాల ప్రజలందరికీ సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు సిద్ధాపూర్‌లో “ఎకో పేరుతో చెత్త కంపెనీ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. ఇది కేవలం ఒక గ్రామం సమస్య కాదు షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమస్య మన భూమి, మన వ్యవసాయం, మన పర్యావరణం, మన నీరు, మన రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఈరోజు మనం మౌనంగా ఉంటే, రేపు మన పిల్లలు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. రైతులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై మన ప్రజా శక్తిని ప్రభుత్వానికి చూపిద్దాం. ప్రజల అభిప్రాయాన్ని, మన గ్రామాల భవిష్యత్తును పక్కన పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మనం ప్రశ్నిస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా వ్యతిరేకిస్తాం. కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆగస్టు 11 మంగళవారం ఉదయం 9:30 గంటలకు జరిగే మహా ధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చి మన ఐక్యతను చాటుదాం. ఇది ఎవరో ఒక్కరి పోరాటం కాదు—సిద్ధాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల, తండాల ప్రతి ఇంటి పోరాటం. మన ఊరు కోసం… మన భూమి కోసం… మన భవిష్యత్తు కోసం… ఇప్పుడే ఒక్కటవుదాం!
సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ జీవో 641 రద్దు అయ్యే వరకు కలసికట్టుగా పోరాడుదాం!!
“చెత్త కంపెనీ వద్దు — సిద్ధాపూర్‌కు రక్షణ కావాలి!”
“మన భూమి — మన హక్కు! మన ఊరు — మన బాధ్యత!”
మహా ధర్నాకు ప్రతి ఒక్కరూ తప్పక తరలిరండి!ప్రయాణం ఎక్కడ మొదలైనాగానీ… గమ్యం మాత్రం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం!ఇట్లు,
మూడవాత్ రాంబల్ నాయక్,చైర్మన్,
పినపాక ప్రభాకర్,కన్వీనర్,
సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ.



