ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeఎడిటోరియల్కేసముద్రంలో జనసంద్రంగా గీతన్నల జైత్ర యాత్ర

కేసముద్రంలో జనసంద్రంగా గీతన్నల జైత్ర యాత్ర

📰 Generate e-Paper Clip

కేసముద్రంలో జనసంద్రంగా గీతన్నల జైత్ర యాత్ర

కేజీకేస్ రాష్ట్ర బృందానికి గజమాలతో ఘన స్వాగతం గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్

గీతన్నలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి

రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు

కేజీకేస్ రమణ ప్రతిపాదించిన డిమాండ్లను వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా
సమ్మయ్య గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర కేసముద్రంలో జనసంద్రంగా కొనసాగింది. కేజీకేస్ మండల అధ్యక్షులు బబ్బూరి ఉప్పలయ్య, కేజీకేస్ కార్యదర్శి మేడం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ అధ్యక్షన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.మహబూబాబాద్ జిల్లాలో నిన్న ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా సోమవారం కేసముద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసముద్రం మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి గౌడన్నలు, గీత కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 1,000 ద్విచక్ర వాహనలపై, 2,000 మందికి పైగా గౌడన్నలు, గీత కార్మికులు, యువకులతో ఈ చైతన్య యాత్ర ఘనంగా సాగింది.కేసముద్రం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గోపా డివిజన్ అధ్యక్షులు, చిలువేరు సమ్మయ్య గౌడ్ కేజీకేస్ రాష్ట్ర బృందానికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఫ్లైఓవర్ మీదుగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావు ఫూలే సెంటర్‌కు చేరుకుని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను కొనసాగించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ.రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, గీత కార్మికుల సమస్యలను గ్రామస్థాయి నుంచి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ చైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ప్రధాన డిమాండ్లను ఉంచారు.గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు.పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గీత కార్మికులకు తాటి, ఈత చెట్లు ఎక్కడానికి అవసరమైన రక్షణ కిట్లు, భద్రతా పరికరాలను పూర్తిస్థాయిలో అందించాలని, జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న పేరును పఅమోదించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదాలకు గురయ్యే గీత కార్మికులకు మెరుగైన భద్రతా సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని, గౌడ సమాజ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన.శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.గీతన్నలకు అండగా ఉంటా: గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.ఈ సందర్భంగా గోపా డివిజన్ అధ్యక్షులు, చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ కేజీకేస్ ఆధ్వర్యంలో చేపట్టిన గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సు యాత్రకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కేజీకేస్ అధ్యక్షులు యంవి రమణ, బెల్లంకొండా వెంకటేశ్వర్లు ప్రతిపాదించిన న్యాయపరమైన డిమాండ్లను మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ గార్ల సహకారంతో మా కేసముద్రం గడ్డ ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు గౌరవ వేం నరేందర్ రెడ్డి దృష్టికి మీ కేజీకేస్ అధ్యక్ష కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గంతో వారిని కలిసి మీరు చేసినటువంటి డిమాండ్ లను వారి దృష్టికి తీసుకువెళ్లి వారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తో మీ,మన సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని సమ్మయ్య గౌడ్ అన్నారు.కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గీత కార్మికుల కుటుంబాలు, గౌడ సమాజం విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు,ఆర్థిక రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు.అందేలా పిల్లలకు మెరుగైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గౌడ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు, గీతన్నల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లి, పరిష్కారం జరిగే వరకు వారికి అండగా ఉంటాను అని చిలువేరు సమ్మయ్య గౌడ్ అన్నారు గీత కార్మికులు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని. ఐక్యతతోనే గీత కార్మికుల హక్కులను- సాధించుకోవచ్చని అన్నారు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి గౌడన్నకు, గీత కార్మికులకు, యువతకు, గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘాల నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గౌని వెంకన్న,రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు,బన్నీ వెంకట మల్లయ్య , వి. వెంకట నరసయ్య, గౌని సాంబయ్య, చౌగాని సీతారాములు, ఎస్. రమేష్ గౌడ్, ఎస్. వెంకట్ గౌడ్, యమగాని వెంకన్న, గోడం వెంకటేశ్వర్లు, పానుగంటి వీరస్వామి, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నర్సయ్య, బాలబోయిన రాంబాబు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల మండల సొసైటీ కార్యవర్గ నాయకులు, గౌడ యువజన నాయకుడు, గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు, బహుజన కుల సంఘ నాయకులు, మాజీ కార్యవర్గ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రకు సంఘీభావం తెలిపారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!