తల్లి పాలు శిశువు జీవితానికి అమూల్య వరం
మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,
నమస్తే భారత్ :-మరిపెడ
తల్లిపాలే పుట్టిన బిడ్డకు శ్రేయస్కారమని, అవి అమృతంతో సమానమని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాంపురం 1 అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవంలో భాగంగా ఘనంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న , కొత్త గర్భిణీల ఆహ్వానం, స్వీకరించి, బాలింతలు, గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వడంతో బిడ్డ ఆరోగ్యంవంతంగా.ఉంటారన్నారు. పిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. పిల్లలకు సిజనల్ వ్యాధులు దరిచేరే అవకాశాలు ఉండవన్నారు. పుట్టిన బిడ్డకు మొదట గంటలోపు ఇచ్చే పసుపు రంగు ముర్రుపాలు ప్రాణాంతక వ్యాధుల భారీనపడకుండా! రక్షణ కవచంగా కాపాడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ సెక్టార్ సూపర్వైజర్ వి. రాజ్యలక్ష్మి డాక్టర్ స్వామి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.



