ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeఎడిటోరియల్పోలీస్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీలు ఖరారు

పోలీస్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీలు ఖరారు

📰 Generate e-Paper Clip

పోలీస్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీలు ఖరారు

సీఐ సాయిరమణ

నర్సంపేట అగష్టు 3 (నమస్తే భారత్) :

తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేసినట్లు దుగ్గొండి సీఐ సాయిరమణ తెలిపారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గత వారం తెలంగాణ ప్రభుత్వం 7,437 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో నియామకాలు చేపట్టనున్నారు.దుగ్గొండి సర్కిల్ పరిధిలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పోలీస్ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, సందేహాల నివృత్తి కోసం సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చునన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!