ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeఎడిటోరియల్కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలే బలమైన వేదిక

కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలే బలమైన వేదిక

📰 Generate e-Paper Clip

కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలే బలమైన వేదిక

లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అభినందనలు

-నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో సత్కారం

-కాలనీల సమగ్రాభివృద్ధిలో నివాసుల భాగస్వామ్యం అవసరం

-కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల కల్పన

-లక్ష్మీనగర్ అభివృద్ధికి నిరంతర సహకారం అందిస్తాం

-ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు

-కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, సంఘ సభ్యులు

కుత్బుల్లాపూర్, జూలై 27: ( నమస్తే భరత్ ఆంధ్ర); కాలనీల సమగ్రాభివృద్ధిలో రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర అత్యంత కీలకమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 129వ డివిజన్ సూరారం పరిధిలోని లక్ష్మీనగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన నామిరెడ్డి అమృత, ప్రధాన కార్యదర్శి హరిశంకర్ రావుతో పాటు నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా నిలుస్తాయని పేర్కొన్నారు. లక్ష్మీనగర్‌తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అనేక కాలనీలు, బస్తీల్లో కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా లక్ష్మీనగర్ కాలనీ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండకల్ల యాదిరెడ్డి, కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి, కోల శ్రీకాంత్ ముదిరాజ్, వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు సురేష్, కె. రాఘవేందర్ రెడ్డి, ఇంద్రసేన, ప్రభులింగం, కె.వి. రమణ, ఏ. వెంకటేశ్వర్ రావు, సభ్యులు సాయి ప్రేమ్, వెంకటప్ప రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎన్. యశ్వంత్ రెడ్డి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!