ePaper
Saturday, August 8, 2026
ePaper
Homeఎడిటోరియల్పేపర్ కప్పులు, ప్లాస్టిక్‌కు గుడ్‌బై... స్టీల్ గ్లాసుల వినియోగమే ఆరోగ్య రక్షణ

పేపర్ కప్పులు, ప్లాస్టిక్‌కు గుడ్‌బై… స్టీల్ గ్లాసుల వినియోగమే ఆరోగ్య రక్షణ

📰 Generate e-Paper Clip

పేపర్ కప్పులు, ప్లాస్టిక్‌కు గుడ్‌బై… స్టీల్ గ్లాసుల వినియోగమే ఆరోగ్య రక్షణ


లయన్స్ క్లబ్ హైదరాబాద్ సనత్‌నగర్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమం

వేడి పానీయాలకు స్టీల్ గ్లాసుల వినియోగంతో ఆరోగ్య పరిరక్షణకు పిలుపు

ప్లాస్టిక్, పేపర్ కప్పుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచన

కల్తీ ఆహారం, హానికర పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి

‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది’ – లయన్ అన్నెం కోటిరెడ్డి
సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన లయన్స్ క్లబ్ సభ్యులు

కుత్బుల్లాపూర్, జులై 27 ( నమస్తే భరత్ ): పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సనత్‌నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరూ పేపర్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులను పూర్తిగా పక్కనపెట్టి స్టీల్ గ్లాసుల్లోనే టీ, కాఫీ వంటి వేడి పానీయాలను సేవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా లయన్ అన్నెం కోటిరెడ్డి మాట్లాడుతూ, “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యంపై చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం జీవనశైలిలో మార్పులు, సురక్షిత ఆహారపు అలవాట్లు, హానికర పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాలని నిరంతరం సూచిస్తోంది” అని పేర్కొన్నారు. వేడి పానీయాలను పేపర్ కప్పులు లేదా ప్లాస్టిక్ పాత్రల్లో తీసుకోవడం కంటే స్టీల్ గ్లాసుల్లో సేవించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు, ఒకసారి మాత్రమే వినియోగించే పాత్రలను వీలైనంత వరకు దూరంగా ఉంచి, పర్యావరణహితమైన , ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ప్రజలు తినే ఆహారం నాణ్యమైనదేనా, కల్తీ రహితమా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి కుటుంబం ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్ బి. సుధాకర్, లయన్ వి. తిరుపతి రెడ్డి, లయన్ హనుమంతు నాయుడు, లయన్ అనంత రెడ్డి, లయన్ నాగమల్లేశ్వరరావు, లయన్ జి.వి. రమణ రెడ్డి తదితరులు పాల్గొని స్టీల్ గ్లాసుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు తమ వంతు కృషి చేయాలని సంకల్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!