ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్కల్లుగీత కార్మిక గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్...

కల్లుగీత కార్మిక గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

కల్లుగీత కార్మిక గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కార్యక్రమానికి అతిథిగా గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ చిలువేరు

నమస్తే భారత్ :-కేసముద్రం

తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా.నిర్వహించనున్న.అమరుల.యాదిలో.గీతన్నల చైతన్య యాత్ర. రాష్ట్ర బస్సు యాత్ర పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ( టి పి యస్ కె హాల్)లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు.ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి కల్లుగీత కార్మిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమ్మి ఫౌండేషన్ చైర్మన్, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, గీత వృత్తి అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, గీత కార్మిక కుటుంబాల ఆర్థిక భద్రత కోసం చేపడుతున్న గీతన్నల చైతన్య యాత్ర.ను ప్రతి గీత కార్మికుడు తన సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వారి సంక్షేమం కోసం అందరూ సంఘటితంగా ముందుకు సాగాలని అన్నారు.
ఈ సందర్భంగా గీత కార్మికులకు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రూ.4,000 పెన్షన్, ప్రమాద మరణ ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంపు, 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు పెన్షన్, అలాగే వృత్తి నిర్వహించే ప్రతి గీత కార్మికుడికి ‘కాటమయ్య రక్షణ కవచం’ వంటి సంక్షేమ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేసి గీత కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు అదేవిధంగా.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఆగస్టు 2న మహబూబాబాద్.(మానుకోట)లో.ప్రారంభమయ్యే రాష్ట్ర బస్సు యాత్రకు కేసముద్రం మండలంతో పాటు ఉమ్మడి మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి గీత కార్మికులు, యువత, సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి చైతన్య యాత్రను విజయవంతం చేయాలని చిలువేరు సమ్మయ్య గౌడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, వంగ సదానందం గౌడ్, ప్రభులింగం గౌడ్, వి. వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!