వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో
మరిపెడ మండల సన్నాహక సమావేశం
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో మూడు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహాగా సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కామ్రేడ్ గుండ గాని మధుసూదన్ అధ్యక్షత వహించగా శెట్టి వెంకన్న, సమ్మెట రాజమౌళి, బాణాల రాజన్న, లూ మాట్లాడుతూ దేశంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని అన్నారు, దేశంలో రైతు వ్యతిరేక విధానాలను తీసుకువస్తూ, దేశంలో విచ్చలవిడిగా క్రిమిసంహారక రసాయనాల ఎరువులను ఎక్కువ మొత్తంలో పెంచుతూ కార్పొరేట్ వ్యవస్థకు పట్టం కడుతుందని చెప్పారు, అదేవిధంగా తక్షణమే మూడు విద్యుత్ చట్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు, కార్మిక ఉద్యోగ రంగాల్లో ఎంతోమంది ఉద్యోగులు ప్రాణధర్పణ చేసి కార్మిక చట్టాన్ని దశాబ్దాల కాలంగా సాధించుకుంటే వాటిని తొలగించి నాలుగు లేబర్ కోళ్లను తీసుకురావడానికి తీవ్రంగా విమర్శించారు,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి, వి బి జి రామ్.జి.పథకాన్ని.తీసుకువచ్చారన్నారు, దీని ద్వారా 25 రోజుల పని పెరుగుతుందని భూకాఇస్తా ఉన్నారు, గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులను, కేటాయించేది కానీ ఇప్పుడు కేవలం 60% నిధులు మాత్రమే ఇస్తూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది, ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులు, రైతు సంఘం నుండి తాటికొండ అనంత చారి, తాడూరి వీరేంకులు, నలబోలు లక్ష్మారెడ్డి, సిఐటియు నుండి సామ్యూల్ మండల కన్వీనర్ కొండ ఉప్పలయ్య, వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం నుండి తూము విజయ్, పూలపాక గణేష్, అల్వాల యాకమ్మ, ఐద్వా మండల కార్యదర్శి దొంతు మమత, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు



