ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న 

ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న 

📰 Generate e-Paper Clip

ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న 

 

నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్

 

నమస్తే భారత్ :-కురవి

 

ఎల్ నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు పై ఆలోచన చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి కోరారు

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంన కురవి మండలం రాజోలు గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణములో వచ్చిన మార్పుల దృష్ట్యా, కనీస వర్షాపాతం లేకపోవడంతో చెరువుల్లో కుంటల్లో నీరు రాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం ప్రాజెక్టులలో తగినంత నీరు రానందున, ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నందున తప్పనిసరిగా రైతులు వరి సాగును తగ్గించుకొని తక్కువ నీటితో సాగు అయ్యే ఆరుతడి పంటలైన పెసర, కంది, మినుము, జొన్న లాంటి పంటలను సాగు చేయాలని కోరారు.తక్కువ ఖర్చు,రవణా ఇబ్బంది లేకుండా, మొక్కకు నేరుగు చేరడం, ఎక్కువ ఉపయోగం ఉండే నానో యూరియా, నానో డి ఏ పి రైతాంగం వాడి పర్యావరణ పరిరక్షణకు కూడా తొడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరసింహారావు, ఇరిగేషన్ ఏఈ  కవిత, ఏఈఓ రజినీకాంత్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!