ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeఎడిటోరియల్131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో తాగునీటి సమస్యపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో తాగునీటి సమస్యపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

📰 Generate e-Paper Clip

131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో తాగునీటి సమస్యపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

కాలనీలో పర్యటించి సమస్యలపై సమగ్ర చర్చ

త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి

కుత్బుల్లాపూర్, జూన్ 9 ( నమస్తే భరత్ ); 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్రమైన తాగునీటి సమస్యపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ విభాగం మేనేజర్ రవి, మేనేజర్ శివ ప్రసాద్, లైన్మెన్ అజీజ్ కాలనీలోని పలు ప్రాంతాలను సందర్శించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు.
స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తాగునీటి సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు, పైప్‌లైన్ నిర్వహణలో ఉన్న ఇబ్బందులు తదితర అంశాలపై అధికారులు స్థానిక ప్రతినిధులు, ప్రజలతో చర్చించారు. సమస్య తీవ్రతను ప్రత్యక్షంగా గమనించిన అధికారులు సంబంధిత అంశాలను నమోదు చేసుకుని, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక డివిజన్ బి.ఆర్.ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, నసీర్, వెంకటేష్, సురేష్ పాల్గొని కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు. అధికారులు సమస్య పరిష్కారానికి అవసరమైన సాంకేతిక చర్యలను పరిశీలించి, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానికులు కూడా అధికారుల పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!