ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeఎడిటోరియల్గిరిజన ఉద్యమ నాయకుడు బిర్స ముండా వర్దంతి

గిరిజన ఉద్యమ నాయకుడు బిర్స ముండా వర్దంతి

📰 Generate e-Paper Clip

గిరిజన ఉద్యమ నాయకుడు బిర్స ముండా వర్దంతి

మహబూబాబాద్ జూన్ 9 (నమస్తే భారత్ ) :

మహబూబాబాద్ పట్టణంలో బిర్సాముండా వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ముఖ్య అతిథిలుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎస్ టీ సెల్ రాష్ట్ర కో ఆర్డిటినేటర్ గుగులోత్ వెంకట్ నాయక్,బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ లు బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళీలు అర్పించారు.ఈసందర్భంగా వెంకట్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ఉధ్యమా నాయకుడు బిర్స ముండా భారతదేశంలోని ప్రముఖ స్వతంత్ర పోరాటనాయకులు. ఆయన జార్ఖండ్ ప్రాంతంలోని ముండా తెగకు చెందినవారన్నారు.బ్రిటిష్ పాలనకు అలాగే స్థానిక జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి ఉద్యమం నడిపిన మహా నాయకుడు అని కొనియాడారు. ఈ ఉద్యమాన్ని ఉల్గులాన్ అనగా మహా తిరుగుబాటు చేశాడు.గిరిజనుల భూమి హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడు ఆత్మగౌరవం స్వయం పాలన కోసం ఉద్యమం నడిపినటువంటి నాయకుడు. ఇతను చిన్న వయసులోనే అనగా 25 సంవత్సరాల వయసులోనే మరణించడం జరిగింది.బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ వారు బహుజన నాయకత్వం,ప్రాముఖ్యతను వివరించారు. సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు యువత భాగస్వామ్యంపై, ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.బహుజన రాజ్యమే అంతిమ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ఎస్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు తేజావత్ శంకర్ నాయక్, ఎస్టీ సెల్ బోడ రాము టౌన్ వైస్ ప్రెసిడెంట్, అల్లి దుర్గేష్ టన్ ఓబీసీ అధ్యక్షులు, టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే గఫూర్, బోడ శ్రావ్య నాయక్ ఆదివాసి నాయకులు, కొత్త యుగేందర్ ,బానోత్ బద్రమ్మ భూక్య రాధా, బోడ అలీ, పల్లి రాములు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!