మెడికల్ కాలేజీకి నూతన ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య

నర్సంపేట జూన్ 9 (నమస్తే భారత్ ) :
నర్సంపేట పట్టణంలోని జిల్లా స్థాయి మెడికల్ కాలేజీకి నూతన ప్రిన్సిపల్ గా డా. సంధ్య నియమితులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి స్టాఫ్ ఏడీ సాజిద్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ , టీ. ఎన్.జీ.ఓ స్టేట్ ఈసీ మెంబర్ ఎండీ. మొయిజుద్దీన్ , ఆఫీస్ సూపరింటెండెంట్ రవీందర్ తదితరులు నూతన ప్రిన్సిపల్ కి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

