ePaper
Monday, June 15, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ దందా ఆపాలి

ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ దందా ఆపాలి

📰 Generate e-Paper Clip

*ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ దందా ఆపాలి*

*ఇది ఒక్క పుస్తకాలతో ఆగదు నోట్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, షూస్ వరకు ఈ దందా కొనసాగుతుంది .*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 14:పర్మిషన్ లేని ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్ అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలి రేపటి నుండి అన్ని స్కూల్స్ లో తనిఖీ లు నిర్వహించాలి
పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ ప్రతి సంవత్సరం పిల్లలను బలవంతంగా స్కూల్ నుంచి లేదా స్కూల్ సూచించిన షాపుల నుంచి మాత్రమే ఖరీదైన పుస్తకాలు కొనాల్సిన పరిస్థితి ఉంది. ఇది స్పష్టమైన వ్యాపార దందా. దీన్ని వెంటనే ఆపాలి
స్కూల్స్ తమ సొంతం లేదా భాగస్వామ్య ఎంపిక చేసిన పబ్లిషర్లతో ఒప్పందాలు చేసుకుంటాయి.మార్కెట్‌లో లభించే అదే పుస్తకాల కంటే 30-60% ఎక్కువ ధరకు విక్రయిస్తారు.పాత పుస్తకాలను కూడా కొత్తవిగా లెక్కించి, రీప్రింట్ చేసి అమ్ముతారు స్కూల్ పుస్తకాలు మాత్రమే ఉపయోగించాలి” అని బలవంతం చేస్తారు. వేరే చోట నుంచి తెచ్చినా అనుమతించరు మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరానికి వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క పిల్లవాడికి 8,000 నుంచి 15,000 రూపాయల వరకు బుక్స్ & స్టేషనరీ మీదే వెళ్తుంది.
అదే ఎన్ సి ఇ ఆర్ టి లేదా స్టేట్ సిలబస్ పుస్తకాలు మార్కెట్‌లో సగం ధరకు దొరుకుతాయి. కానీ స్కూల్ లోగో పెట్టి అమ్ముతారు.దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!