ePaper
Monday, June 15, 2026
ePaper
Homeఎడిటోరియల్అబ్బాయిపాలెం.మిషన్ భగీరథ ప్లాంట్

అబ్బాయిపాలెం.మిషన్ భగీరథ ప్లాంట్

📰 Generate e-Paper Clip

అధ్యక్షులు రాయల శ్రీను

నమస్తే భారత్ :-మరిపెడ

మిషన్ భగీరథలో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని, తమ న్యాయమైన హక్కుల సాధన కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని మిషన్ భగీరథ ప్లాంట్ అధ్యక్షులు రాయల శ్రీను పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఆదివారం కార్మికుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాయల శ్రీను, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా రాయల శ్రీను, ఉపాధ్యక్షుడిగా గూడూరు మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా సైదులు వెంకట్, కోశాధికారిగా సైదులు అనిల్, కార్యదర్శిగా కావళ్లి దయాకర్, స్టేట్ మీడియా అడ్వైజర్‌గా బాబోత్ నవీన్ ఎన్నికయ్యారు. వీరితో పాటు 30 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కాగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీను ను కమిటీ సభ్యులుఅభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!