ePaper
Friday, November 13, 2026
ePaper
Homeతెలంగాణమహిళలు అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలి

మహిళలు అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలి

📰 Generate e-Paper Clip

మహిళలు అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలి

ఎంపీడీవో శంకర్ నాయక్

వరంగల్ నవంబర్11( మల్లేష్ నమస్తే భారత్ ) :

మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా సమైక్యలకు పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, బూర్గుమళ్ళ గ్రామాల్లో సర్పంచ్ లు వెంకటేశ్వరరావు, ఎలికట్టే కృష్ణవేణి ఆధ్వర్యంలో మహిళా వివో భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీఓ శేశాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ నాయక్ ఎంపీఓ శేశాంజనేయులు మాట్లాడుతూ… మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని సాధికారత సాధించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. విబిజి రాంజీ పథకం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న పనులకు హాజరు శాతం పెంచుటకు మహిళలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు కోరారు. ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరు నడుము బిగించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు. ఏల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి భూగర్భ జలాల నీటిమట్టాన్ని పెంపొందించుటకు కృషి చేయాలని వారు కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో విబిజి రాంజీ పథకం ద్వారా నిర్మించిన మ్యాజిక్ సోఫిట్స్, మరుగుదొడ్డి నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు కృష్ణవేణి వెంకటేశ్వరరావు ఎంపీఓ శేషంజన్ స్వామి ఏపిఎం రాజీరు, సీసీలు గోలి కొమురయ్య, వర్కాల సుధాకర్ పంచాయతీ కార్యదర్శి గూగులోత్ అశోక్ నాయక్, కిరణ్ జిపిఓ యాకయ్య సొసైటీ డైరెక్టర్లు లింగంపల్లి కుమార్ రావు కందుల లావణ్య రాజు, జిపీల పాలకవర్గ సభ్యులు వివోల ప్రతినిధులు, వివోఏలు, ఏఎన్ఎంలు, అంగన్వాడి ఆశా కార్యకర్తలు, ఎమ్మెస్ సిబ్బంది, మహిళా స్వయం సహాయక బృందాల లీడర్లు సభ్యులు గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!