ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్పాఖాల ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలి

పాఖాల ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

పాఖాల ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలి

పాఖాలను సందర్శించిన సిపిఎం నాయకులు

ఖానాపురం ఆగష్టు12( నమస్తే భారత్ ) :

పాఖాల చెరువు ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య, ముంజాల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఖాల ఆయకట్టు రైతులకు నీరు అందించాలని కోరుతూ సీపిఎం నాయకుల బృందం బుధవారం పాఖాల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాట్లు వేయడం కోసం రైతాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ పాఖాల చెరువులో సుమారుగా 19 ఫీట్లు ఉన్నా కూడా నేటి వరకు నీరు విడుదల చేయకపోవడం మూలంగా ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నారన్నారు. గోదావరి జలాలు చెరువులోకి వస్తున్నప్పటికీ బయటికి నీరు వెళ్లకుండా నీటి సామర్థ్యం ఎందుకు పెరగడం లేదన్నారు.ఆయకట్టు చెరువు పైన ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున మోటార్లను పెట్టి బయటికి నీళ్లను పంపిణీ చేయడం వల్ల ఆయకట్టు రైతాంగానికి నీళ్లు రావడంలేదని ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు ప్రభుత్వం యంత్రాంగం పర్యవేక్షణ కరువైందని విమర్శించారు. సుమారుగా 30వేల ఎకరాల పైచిలుకు ఉన్న ఆయకట్టు రైతాంగానికి నీరు ఇవ్వడం అవసరం లేదా , ప్రభుత్వానికి రైతాంగినికి నీరందించే బాధ్యత లేదా అని వారు ప్రశ్నించారు. పోసిన నార్లు ముదిరిపోతున్న నార్లు ఎండిపోతున్న నీళ్లు విడువకపోవడం మూలంగా అనేకమంది రైతులు నష్టపోయారన్నారు. కొద్దో గొప్పో నార్లు కాపాడుకున్న రైతులు నాటు వేసుకుందామంటే నీరు వదలక పోవడం ఏమిటన్నారు. ఒకపక్క రైతాంగం సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి పంటలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయని ఆనుకుంటే అధికార యంత్రాంగం వ్యవహారిస్తున్న తీరు అశ్చర్యకరంగా ఉందన్నారు. నీటి విడుదలపై ఐబి అధికారులకు ఎలాంటి ప్రణాళికాలు ఉన్నాయో రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులకు స్వతంత్రత లేకుండా ఉందా రాజకీయ నాయకుల అనుమతులతోనే వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారా అనేది అర్థం కావడం లేదని విమర్శించారు. పాఖాల చెరువు ఆయకట్టు రైతులకి సమృద్ధిగా పంటలు పండడం కోసం పూర్తిస్థాయిలో గోదావరి జలాలు వస్తున్నాయని ఆ జలాలను ఆయకట్టు రైతాంగం కోసం వాడితే మొత్తం సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బీరం శ్రీనివాస్ ,చింతకింది తిరుపతి ,కొత్తపెళ్లి రాజేందర్ ,రమేష్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!