ePaper
Monday, October 19, 2026
ePaper
Homeతెలంగాణఅభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యం:

అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యం:

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యం:

కౌన్సిలర్ పనుగోతు రాములు

కౌన్సిలర్ మెరుగు రాముగారూ

నమస్తే భారత్ :-మరిపెడ

రోడ్లు, డ్రైనేజీ పనులకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపును పరిశీలించిన కౌన్సిలర్లు.వార్డుల అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని స్థానిక కౌన్సిలర్ మెరుగు రాము స్పష్టం చేశారు. 3వ మరియు 4వ వార్డుల పరిధిలో కొనసాగుతున్న సైడు కాలువలు (డ్రైనేజీలు), నూతన రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ అభివృద్ధి పనులకు ఆటంకంగా, ప్రమాదకరంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ వృక్షాలను జేసీబీ సహాయంతో తొలగించే ప్రక్రియను కౌన్సిలర్ మెరుగు రాము దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పనుగోతు రాములు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎడి వారి సిబ్బంది కూడా పాల్గొన్నారుఈ సందర్భంగా మెరుగు రాము మాట్లాడుతూ. వార్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాకపోకలు సజావుగా సాగేలా ఆధునిక రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు, కాంట్రాక్టర్లు చొరవ చూపేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్డు అభివృద్ధిలో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!