ePaper
Wednesday, July 15, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సొంతింటి కల సహకారం

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సొంతింటి కల సహకారం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సొంతింటి కల సహకారం

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

నమస్తే భారత్ :-తొర్రూరు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని నిరుపేదలకు సొంతింటి కల సహకారం అవుతుందని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం తొర్రూరు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కొత్త ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, హౌసింగ్ ఏఈ యామిని,బసన బోయిన రాజేష్, రాజు,పార్టీ నాయకులు, లబ్ధిదారులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!