ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణమండల పశువైద్య కేంద్రము ఆకస్మిక తనిఖీ జిల్లా పశుసంవర్ధక అధికారి

మండల పశువైద్య కేంద్రము ఆకస్మిక తనిఖీ జిల్లా పశుసంవర్ధక అధికారి

📰 Generate e-Paper Clip

మండల పశువైద్య కేంద్రము ఆకస్మిక తనిఖీ

జిల్లా పశుసంవర్ధక అధికారి

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం : సెప్టెంబర్ 9,(నమస్తే భారత్)

జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి టి.ఆదిత్య వర్మ పాపన్నపేట మండల పశువైద్య కేంద్రమును ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పశు వైద్య సేవలపై అరా తీశారు మరియు మండల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా పశువైద్య సేవలను సమర్ధవంతంగా అందించడంతోపాటు టీకాల కార్యక్రమం పటిష్టంగా అమలు పరచడం, పశువైద్య శిబిరాల నిర్వహణ, మరియు కృత్రిమ గర్భాధారణ కార్యక్రమం వాటి ఆన్లైన్ పురోగతిపై వరాలు అడిగి తెలుసుకున్నారు.పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పశుపోషకులకు చేరేలా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సూచించారు. ఈ సమావేశంలో మండల పశు వైద్యాధికారులు డాక్టర్ సౌమ్య రెడ్డి డాక్టర్ ప్రవీణ్ కుమార్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సతీష్ కుమార్, శివాజీ, LSA లు సురేష్, రాకేష్ , సిబ్బంది గోపాల మిత్రులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!