ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్‌ఐఆర్ ఫారాలు త్వరగా పూర్తి చేయాలి

ఎస్‌ఐఆర్ ఫారాలు త్వరగా పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్ ఫారాలు త్వరగా పూర్తి చేయాలి

– నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఫారాల పురోగతిపై నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎల్‌ఓ లు కలమ్మ,ఉమా,బీఎల్‌ఏ భయ్యా లింగయ్య ద్వారా ఎస్‌ఐఆర్ ఫారాల వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మెరుగు రాము మాట్లాడుతూ.ఎస్‌ఐఆర్ ఫారాల సమర్పణ గడువును ప్రభుత్వం ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఇంకా ఫారాలు పూర్తి చేయని ఓటర్లు వెంటనే వాటిని నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు.నిర్లక్ష్యం కారణంగా ఓటు హక్కును కోల్పోకుండా,ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకునేందుకు ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ఫారాన్ని పూర్తి చేయాలని.సూచించారు.ఫారాల నింపడంలో ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి వివరాలు తెలుసుకుని గడువులోగా ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు యాకూబ్ పాషా,బాషిత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!