ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeఎడిటోరియల్శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

మధుర జ్ఞాపకాలతో సాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని శ్రీ శాంతినికేతన్ హై స్కూల్‌లో సోమవారం రోజున 2005-2026 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా మరియు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ నాటి జ్ఞాపకాలను పంచుకోవడానికి మిత్రులంతా ఒక్కచోటుకి చేరడంతో ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఈ వేడుకకు పాఠశాల ఉపాధ్యాయులు యాదయ్య, మోమిన్ విచ్చేశారు. గురువుల సమక్షంలో పూర్వ విద్యార్థులు తమ నాటి పాఠశాల అనుభవాలను, అల్లరి రోజులను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు మూడ్ శ్రీ కుమార్, విక్రమ్, ఇస్లావత్ సురేష్, దీక్షిత్, రంజిత్ ,నాగేశ్వర్ రావు, బిచ్చు , యాకయ్య,మహేష్, జరుపుల సురేష్, రమేష్, వెంకన్న, రంజిత్, మోహన్, సేవ్య , శ్యాం, భద్రు ,వెంకటేష్,మహేష్, ఉమ, అనూష, మంగ దేవి, శ్వేత,గీత, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కలిసి భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ కలయికలను తరచూ నిర్వహించుకోవాలని పరస్పరం ఆకాంక్షించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!