ePaper
Monday, October 12, 2026
ePaper
Homeఎడిటోరియల్రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి.. కన్నీళ్లలో వెంకంపహాడ్! అన్న కలను నిజం చేస్తున్న తమ్ముడు ప్రశాంత్

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి.. కన్నీళ్లలో వెంకంపహాడ్! అన్న కలను నిజం చేస్తున్న తమ్ముడు ప్రశాంత్

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి.. కన్నీళ్లలో వెంకంపహాడ్!
అన్న కలను నిజం చేస్తున్న తమ్ముడు ప్రశాంత్

 

అన్న లేకపోయినా ఆశయం బతికే ఉంది

– వెంకంపాహాడ్ లో ఆడపడుచుల కోసం లైట్లు, డీజే తో దసరా సంబరాలు

నమస్తే భారత్ :-మరిపెడ

వెంకంపాహాడ్ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి, ప్రజల మన్ననలు పొందిన వెంకంపాహాడ్ గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం గ్రామానికి తీరని లోటు. ఆయన మరణం గ్రామాన్ని శోకసంద్రంలో.ముంచింది.అయితే అన్న మరణాన్ని తట్టుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తమ్ముడు ఉప్పల ప్రశాంత్ నిర్ణయించుకున్నారు. గ్రామ అభివృద్ధి అనే అన్న కలను నిజం చేసే దిశగా అడుగులు.వేస్తున్నారు.ఇందులో భాగంగానే ఈ దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఎంగిలిపూల ఆడపడుచులు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రోడ్డు వెంబడి లైట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డీజే ఏర్పాటు చేసి ఆడపడుచులతో కలిసి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
అన్న.లేని.లోటు.కనిపించకుండా, గ్రామ ఐక్యత, అభివృద్ధే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత సర్పంచ్ సోమన్న ఆశయాలను తమ్ముడు ప్రశాంత్ ఇలాగే ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!