ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeఎడిటోరియల్పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

*పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలి*

*విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసి వేధిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి*.

*తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ₹10,814 కోట్ల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను తక్షణమే విడుదల చేయాలి*

*ఎస్ఎఫ్ఐరంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కేవై ప్రణయ్*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్18: ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపడం అన్యాయమన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు కాగా, వాటిని విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, TC, మెమోలు, ఇతర విద్యా పత్రాలను కళాశాలలు తమ వద్ద ఉంచుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సర్టిఫికెట్లను ఎలాంటి షరతులు లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.ప్రభుత్వం విద్యార్థుల చదువును బాధ్యతగా చూడాలి తప్ప, ప్రైవేట్ కళాశాలల ఆర్థిక ప్రయోజనాలకు విద్యార్థులను బలిచేయకూడదని అన్నారు. పెండింగ్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధాన వైఫల్యానికి నిదర్శనమన్నారు.రాష్ట్రంలో ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేసే విధంగా శాశ్వతమైన నిధుల విడుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల హక్కులను కాపాడేందుకు ఎస్ ఎఫ్ ఐ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ విడుదల చేయడంతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లను వెంటనే అందించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు తనిష్క్, అభినవ్, రుద్రాక్ష,సాయి హర్ష, నిహారిక, రామ్ చరణ్,తరుణ్,రాజేష్ విష్ణువర్ధన్, విధార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!