ePaper
Tuesday, July 28, 2026
ePaper
Homeఎడిటోరియల్పెయింటింగ్ కార్మికుడికి రూ.20 వేల బకాయి వేతనం అందజేత

పెయింటింగ్ కార్మికుడికి రూ.20 వేల బకాయి వేతనం అందజేత

📰 Generate e-Paper Clip

పెయింటింగ్ కార్మికుడికి రూ.20 వేల బకాయి వేతనం అందజేత
-బీఆర్‌టీయూ జోక్యంతో పరిష్కారం
-కాంట్రాక్టర్‌తో చర్చించి వేతనం ఇప్పించిన కార్మిక నాయకుడు రవి
-కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ
-న్యాయం చేసినందుకు బీఆర్‌టీయూ నాయకత్వానికి కార్మికుడి కృతజ్ఞతలు

కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన పెయింటింగ్ కార్మికుడు సతీష్ కుమార్‌కు రావాల్సిన రూ.20 వేల బకాయి వేతనాన్ని బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి జోక్యంతో అందజేశారు. సతీష్ కుమార్ పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. గత నెలకు సంబంధించిన రూ.20 వేల వేతనం చెల్లించాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ పలుమార్లు వాయిదా వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధిత కార్మికుడు తెలిపాడు. పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో తోటి కార్మికుల సూచన మేరకు బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవిని కలిసి తన సమస్యను వివరించాడు. విషయం తెలుసుకున్న రవి వెంటనే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. అనంతరం కార్మికుడు సతీష్ కుమార్‌కు రావాల్సిన రూ.20 వేల బకాయి వేతనాన్ని పూర్తిగా ఇప్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ, తనకు న్యాయం చేసి కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!