దూస్ కల్ పాఠశాలలో నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం..

నమస్తే భారత్ షాద్ నగర్ జులై02:రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సంస్థ, షాద్ నగర్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎఫ్ సి ఎన్ స్వచ్ఛంద సంస్థ పి ఆర్ ఓ శ్రీను తొంట చేతుల మీదుగా చిన్నారులకు దాదాపు 850 నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. శ్రీను మాట్లాడుతూ ఈ నోట్ బుక్స్ ని చిన్నారులు అభ్యసనంలో సరిగ్గా వినియోగించుకొని, చక్కగా చదివి భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రేవతి, ఉపాధ్యాయులు సంతోష్ బాబు, శ్రీనివాస్, సర్ఫరాజ్ అన్వర్ మరియు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు దాతల్ని అభినందిస్తూ వారు ఇదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు సహాయసహకారాలు అందించాలని కోరుతూ వారి నిస్వార్థసేవల్ని కొనియాడారు.



