గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్
గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డితో కలిసి పాఠశాలను పరిశీలించిన ఆమె, పాఠశాలలోని పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, వంటశాల, వంట సామగ్రి, స్టాక్ వివరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు....