ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణశ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

శ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

శ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఇటీవల మరిపెడ బంగ్లాలోని శ్రీ శ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య.పరీక్షలు.చేయించుకోవడంతో పాటు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, ఆధునిక వైద్య పరికరాలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఆసుపత్రి నిర్వాహకులు డా. బంటు కారుణ్య సాగర్తో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగుల అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణ తీరును, ప్రజలకు అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను.ఆమె.అభినందించారు.మరిపెడ బంగ్లా వంటి ప్రాంతంలోనే ప్రజలకు నగర స్థాయి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం.అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శ్రీ శ్రేష్ట హాస్పిటల్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆమె కొనియాడారు. భవిష్యత్‌లో ఆసుపత్రి మరింత అభివృద్ధి చెంది, అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!