ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణతొర్రూరులో స్కానింగ్‌ సెంటర్లపై వైద్యాధికారుల తనిఖీలు

తొర్రూరులో స్కానింగ్‌ సెంటర్లపై వైద్యాధికారుల తనిఖీలు

📰 Generate e-Paper Clip

తొర్రూరులో స్కానింగ్‌ సెంటర్లపై వైద్యాధికారుల తనిఖీలు


లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు:

డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి రాథోడ్

నమస్తే భారత్ :-తొర్రూరు

తొర్రూరు పట్టణంలోని స్కానింగ్‌ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో శనివారం వైద్య బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా గర్భిణులకు నిర్వహించిన అల్ట్రాసౌండ్‌ పరీక్షలకు సంబంధించిన ఫారం-ఎఫ్ రికార్డులు, ఆడిట్ వివరాలు, స్కానింగ్‌ యంత్రాలు, ఇతర రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, వెల్లడించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పీసీపీఎన్‌డీటీ చట్టం-1994 నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఫారం-ఎఫ్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జ్వలిత, మనోహర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!