ePaper
Wednesday, November 4, 2026
ePaper
Homeతెలంగాణగొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు

గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు

📰 Generate e-Paper Clip

గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు

యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి పలువురు జనసేనలోకి..

తొండంగి, నవంబరు 3: తొండంగి మండలం గొర్సపాలం గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు ఆదేశాల మేరకు గొర్సపాలానికి చెందిన యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నాయకులు నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలు గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ విధానాలు, నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు జనసేనలో చేరే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంతో గొర్సపాలంలో జనసేన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!