ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి

ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య

నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్ట్14:కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విధానాలను నీరసిస్తూప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య అన్నారు ఈ సందర్భంగా ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన గోడ పత్రిక కొందుర్గు బస్టాండ్ ఆవరణలో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన మాట్లాడుతు కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తూ పాలన సాగిస్తుందని ఆయన ఆరోపించారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నెరవేర్చలేక ధరల మీద ధరలు పెంచి ప్రజల నెత్తిపై మోపి ఇష్టానుసారగా వ్యవహరిస్తుందని ఆయన దుయబట్టారు నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పేదవారి అకౌంట్లో 15 లక్షలు చేస్తామన్న నరేంద్ర మోడీ ఒక్క రూపాయి నల్లధనాన్ని కూడా దీనికి తీసుకురాలేక పొగ అవినీతిపరులను నీరం మోదీ విజయ్ మాల్యా లాంటి బ్యాంకులను మోసగించిన సీటర్స్ను దేశం నుంచి తప్పించి విదేశాలకు పంపించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కిందన్నారు
ప్రజలు బిజెపి ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉద్యమించి సందర్భం వచ్చినప్పుడు జాతీయవాదం కులం మతం పేరుతో ప్రజలను చల్లబరుస్తున్నారు
యువత తిరగబాటు కాక్రోచ్ జనతపార్టి రూపంలో స్పష్టంగా అర్థమైందని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు బిజెపి ప్రభుత్వం పై చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు సర్ పేరా ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారు ఇప్పటికే 73 లక్షల ఓట్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తొలగించారు 18 సంవత్సరాలు నిండిన యువత దేశంలో ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఓటు హక్కు ఎందుకు కల్పిస్తలేరు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు విత్తనాల పేర పెట్రోల్ డీజిల్ భారీ కుంభకోణానికి తెరలేపింది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నిజాయితీ గురించి చెప్పుకునే నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎందుకు తగ్గిస్తలేరు అని ఆయన ప్రశ్నించారు వెంటనే పెంచిన ధరలను అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 17 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లాలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను నిర్వహిస్తుందని ఈ ప్రచార యాత్ర 19వ తేదీన కొందుర్గు మండలానికి రాబోతుంది అధిక సంఖ్యలో ప్రజానీకం పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కే యామిని సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు గోపి గడ్డ యాదయ్య సిపిఐ నాయకులు రాములు మల్లయ్య రమేష్ మొగులయ్య ఏఐటియుసి మండల నాయకులు
బి యాదయ్య బి కేఎంయు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!