ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeఎడిటోరియల్వీరాపురం ఇసుక రీచ్, పోడు భూముల సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాంని కలిసిన ఆదివాసి తుడుం దెబ్బ...

వీరాపురం ఇసుక రీచ్, పోడు భూముల సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాంని కలిసిన ఆదివాసి తుడుం దెబ్బ నాయకులు

📰 Generate e-Paper Clip

వీరాపురం ఇసుక రీచ్, పోడు భూముల సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాంని కలిసిన ఆదివాసి తుడుం దెబ్బ నాయకులు

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తి రాజు, తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు కోడేం వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంని కలిసి వినతిపత్రం సమర్పించి పలు విషయాలు పై చర్చించారు. ఈ సందర్భంగా వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి ప్రస్తుతం రెండు గిరిజన సహకార సంఘాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని గిరిజనుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నిష్పాక్షికంగా పరిష్కరించాలని నాయకులు కోరారు. రెండు ఆదివాసి సంఘాలకు సమన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ఆదివాసి జీవనోపాధికి సంబంధించిన పోడు భూముల సమస్యలను, 50 సంవత్సరములుగా ఎస్టీ జాబితాలో అక్రమంగా కొనసాగుతున్న చట్టబద్ధతలేని లంబాడీల విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల దోపిడి, ఏజెన్సీ ప్రాంతానికి విపరీతమైన వలసలపై తుడుందెబ్బ ఇటీవల చేపట్టిన ఉద్యమకార్యచరణపై ప్రొఫెసర్ కోదండరాం గారి దృష్టికి తీసుకెళ్లారు. పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో *శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు పాల్గొని, వీరాపురం రీచ్ అంశానికి సంబంధించిన తమ సమస్యలను ఆదివాసి మహిళల జీవనోపాధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆదివాసి హక్కులు, జీవనోపాధి, పోడు భూముల పరిరక్షణ మరియు సామాజిక ఐక్యతకు సంబంధించిన అంశాలపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రములను సమర్పించారు. ఈ సమస్యలపై సాధ్యమైనంత తొందరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రొఫెసర్ కోదండరాం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!