తెలంగాణ ఉద్యమకారుడు
ముద్దు రాములు కు నివాళ్ళర్పించిన ప్రజా సంఘాల నాయకులు.

నమస్తే భరత్,, 5/10/2026/ నారాయణపేట జిల్లా
రాములు మరణం సమాజానికి తీరనిలోటు
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముద్దు రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ….
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా క్రియాశీలక పాత్ర వహిస్తూ రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కొల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు మరణం సమాజానికే తీరని లోటని అన్నారు. రాజకీయరంగంలో నాయకత్వం వహించాలనే సంకల్పంతో అనేకసార్లు ఎంపీటీసీగా జడ్పిటిసిగా సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ వెనుతిరగకుండా కొల్పూర్ గ్రామ ప్రజల అభిమానాన్ని చూరగొని భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిచినప్పటికీ సర్పంచ్ గా పూర్తి కాలం కొనసాగకుండానే కేవలం ఆరు నెలలు పూర్తిచేసుకుని తను తుది శ్వాస విడవడం బాధాకరమైన విషయం అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఊరు ఊరు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని రాజేయడంలో చిత్తశుద్ధితో కృషి చేసిన వ్యక్తి రాములు గారు. అందరితో స్నేహభావంతో వెలుగుతూ తన చుట్టూ ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడే శక్తులకు అండగా నిలిచిన వ్యక్తి రాములు గారని కొనియాడారు. వివిధ సమస్యల కేంద్రంగా తన గ్రామానికి లేదా చుట్టుపక్కల గ్రామాలకు ప్రజాసంఘాల నాయకులు ఎవరు వచ్చినా మా ఇంట్లోనే అన్నం తిని వెళ్ళాలని గౌరవంగా మానవతా దృక్పథంతో ఆహ్వానించేవాడు. మృదు స్వభావి, ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకుడిని కోల్పోవడం సమాజానికి తీరనిలోటని అన్నారు.
ఈ సందర్భంగా ముద్దు రాములు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రజాసంఘాల నాయకులు తెలియజేస్తూ ముద్దు రాములు పోరాటస్ఫూర్తిని నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
మద్దిలేటి (మానవ హక్కుల కార్యకర్త.)
పాలెం వెంకటయ్య
మాలల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు.
డి.హెచ్.జి పోలప్ప
అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు.
జీర్గల్ నాగేష్ మాదిగ
దళిత ఉద్యమ నాయకులు.
లింగన్న – KNPS జిల్లా ఉపాధ్యక్షులు.
మహమ్మద్ అఫ్రోజ్
NSUI జిల్లా అధ్యక్షులు
ఆనంద్ బండారి
BRS పార్టీ నాయకులు
బ్యాగరి సురేష్
యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.
బండారి కథలప్ప,
బండారి శివ,
మాల మహానాడు నాయకులు.
అక్షయ్ కుమార్,బండారి మహాదేవ్, అరవింద్, ఉదయ్ , క్రాంతి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.



