ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్26 ఏళ్ల సంప్రదాయానికి కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మయ్యగౌడ్ చేయూత

26 ఏళ్ల సంప్రదాయానికి కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మయ్యగౌడ్ చేయూత

📰 Generate e-Paper Clip

26 ఏళ్ల సంప్రదాయానికి కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మయ్యగౌడ్ చేయూత

ఉప్పరపల్లి రావణ వధ ప్రతిమ విరాళం.యువత యూత్ క్లబ్‌కు ప్రోత్సాహం

గ్రామాన్ని సొంత ఊరుగా భావిస్తూ సేవా కార్యక్రమాలకు అండ

గత ఏడాది సైతం సహకారం.. సమ్మయ్యగౌడ్ ఔదార్యంపై గ్రామస్థుల హర్షం

నమస్తే భారత్ :-కేసముద్రం

గ్రామీణ సంప్రదాయాల పరిరక్షణకు, యువత నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహానికి కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మయ్యగౌడ్ తనవంతు సహకారం అందిస్తున్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో యువత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 26 ఏళ్లుగా కొనసాగుతున్న రావణ వధ కార్యక్రమానికి ఈ ఏడాది సైతం రావణ వధ బొమ్మను విరాళంగా అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గత ఏడాది కూడా బొమ్మకు విరాళం అందించిన ఆయన, వరుసగా యువత కార్యక్రమానికి అండగా నిలవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పరపల్లి గ్రామాన్ని తన సొంత గ్రామంగా భావిస్తూ పలు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సమ్మయ్యగౌడ్‌కు యువత యూత్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.యువత యూత్ క్లబ్ అధ్యక్షుడు తండ శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామంలో గత 26 ఏళ్లుగా యువత ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లుగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో గ్రామ ప్రజలు, పెద్దలు, దాతల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మయ్యగౌడ్ గత ఏడాది కూడా రావణ వధ బొమ్మకు విరాళం అందించారని, ఈ ఏడాది కూడా రావణ వధ ప్రతిమను ఇచ్చి మా యువత యూత్ సహకరించి యువతకు ప్రోత్సాహాన్ని అందించారని కొనియాడారు. ఇలాంటి సహకారం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, గ్రామంలో నిర్వహించే సేవా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని అన్నారు.సమ్మయ్యగౌడ్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఐక్యంగా ముందుకు వచ్చి మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేయడం సంతోషకరమని తెలిపారు. ఉప్పరపల్లి గ్రామాన్ని తాను సొంత గ్రామంగా భావిస్తానని, గ్రామ ప్రజలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. యువత నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను.పెంపొందించడంతోపాటు భావితరాలకు మన సంప్రదాయాలను పరిచయం చేస్తాయని అన్నారు. ఉప్పరపల్లిలో జరిగే ప్రజోపయోగ, సేవా, సాంస్కృతిక కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యువత యూత్ క్లబ్ అధ్యక్షుడు తండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు జెనిగల అనిల్, బోనగిరి జ్యోతి రమేష్, కంచ రాజు, పలుస పద్మ వెంకన్న, తండ సంపత్, సీనియర్ నాయకులు బండరు దయాకర్, తండ వెంకటేశ్వర్లు, ఎటురోజు సత్యనారాయణ, నాలాగుర్తి ఉప్పలయ్య, కట్ల పాపయ్య, పబ్బతి సారంగం, శాగంటి రాములు, అడపా రమేష్, టేకుల శ్రీకాంత్, ఎం.డి. షబ్బీర్, గుండా కమలాకర్, కార్తీక్, రాజేష్, అల్లావుద్దీన్, రహీమ్, నగేష్, రాంబాబు, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!