రామనర్సమ్మ కుటుంబానికి కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ పరమార్ష

దశకర్మకు హాజరై చిత్రపటానికి నివాళులు. కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు
ఆప్తులను కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిది.. ధైర్యంగా ఉండండి, మీ కుటుంబానికి మేమున్నాం”- సమ్మీగౌడ్
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు వంగ రామనర్సమ్మ దశ దిన కర్మ కార్యక్రమానికి కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామనర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ.. కుటుంబంలో పెద్దను కోల్పోవడం తీరని లోటని, ఆ బాధను మాటల్లో చెప్పలేమని అన్నారు. రామనర్సమ్మ కుటుంబ సభ్యులు ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కష్టసమయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య, వంగ చిన్న వెంకట్రాం నర్సయ్య, సమ్మెట వెంకన్న, నరేటి సత్తయ్య, మొగులాగని సుధాకర్, బోయిని ఉప్పలయ్య, గొర్రె వెంకన్న, పెదగాని చిన్న కోమరయ్య, రామరాజు రవీందర్, శ్రీలం రాములు, యాకన్నా, గండు పరమేష్, మెంచు వెంకన్న, వంగ సంపత్, బోయిని రమేష్, దొంతరబోయిన రమేష్, కండె నాగన్న, వల్లాల రాజేందర్, దొంతరబోయిన ఈశ్వర్, మెంచు వంశీ తదితరులు పాల్గొన్నారు.



