జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ముమ్మర ప్రచారం
డోర్నకల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చింత రమేష్
నమస్తే భారత్ :-మరిపెడ
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు గెలుపే లక్ష్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డోర్నకల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చింత రమేష్ ఆధ్వర్యంలో, జలగం సందీప్, మార్క కృష్ణాకర్ తదితర నాయకులతో కలిసి జనసేన పార్టీ చేపట్టిన “గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్” ప్రచార వాహనం నరసింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలను సందర్శించింది.
ఈ సందర్భంగా చింత రమేష్ పాఠశాలల ప్రిన్సిపాళ్లను మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు అభ్యర్థిత్వాన్ని వివరించారు. అనంతరం గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట, మరిపెడ మండలాల్లో ప్రచార వాహనం మొదటిసారిగా జనసేన పార్టీ నియోజకవర్గంలో ప్రచారం చేయడం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు తో కలిసి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు వారికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాళ్లు,ఉపాధ్యాయులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు.పాల్గొన్నారు.



