ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం

📰 Generate e-Paper Clip

*ఆరోగ్యమే మహాభాగ్యం*

*యోగాతో ఆరోగ్యవంతమైన జీవన విధానం సాధ్యం*

*న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్21:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ పట్టణ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ అధ్యర్యంలో స్థానిక పరిగి రోడ్ సత్యనారాయణ స్వామి టెంపుల్ గ్రౌండ్ లో కుంగ్ ఫు విద్యార్థులతో కలిసి యోగ దినోత్సవం జరిపారు.ఈ సందర్భంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అన్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని సూచించారు.యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తోందని పేర్కొంటూ మండల ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!