ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు మెమోంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం వారిలో మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి అనితా దేవి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!